Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక ఎగుమతులు జరిపే ఆసియా దేశాల్లో తక్కువ జీతాలు
- ఆఫ్రికాలో మరింత దారుణం
- భారత్లో నెలకు దక్కేది 11 వేలే..!
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలో కాలనికనుగుణంగా కొత్త మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత కాలంలో డిమాండ్ ఉన్న రంగాల్లో ఈ టెక్స్టైల్స్ సెక్టారూ ఒకటి. వస్త్ర పరిశ్రమ లాభాలను గడిస్తున్నప్పటికీ అందులో పని చేసే కార్మికుల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది. కనీస వేతనాలకు నోచుకోలేని పరిస్థితి వారిది. కొన్ని సంస్థలు (క్లీన్ క్లాత్స్ క్యాంపెయిన్, షెంగ్ లూ, డెలావేర్ విశ్వవిద్యాలయం) లు సేకరించిన సమాచారం ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. గార్మెంట్ కార్మికులకు నెలవారీ కనీస వేతనాల వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. ప్రధానంగా ఆసియాలో కానీ, ఇటీవలి సంవత్సరాలలో పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా దేశాల్లోనూ ఈ సంస్థలు దృష్టి సారించి సమాచారాన్ని క్రోడీ కరించాయి. షెంగ్లూ, డెలావేర్ విశ్వవిద్యాలయం, ఇథియోపియా ప్రకారం.. వేగంగా అభివృద్ధి చెందు తున్న ఆఫ్రికన్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వస్త్ర పరి శ్రమలో అతి తక్కువ వేతనాలను కలిగి ఉన్నది. ఇక్కడ(ఇథియోపియా) నెలకు దక్కేది 23 యూరోలు (భారత కరెన్సీలో 1973 రూపాయలు) మాత్రమే. న్యూయార్క్ విశ్వవిద్యాలయం 2019లో ప్రచు రించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలోని అనేక ప్రసిద్ధ దుస్తుల సమూహం ప్రస్తుతం ఇథియోపియాలో వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే, చాలా మంది ఇథియో పియన్ గార్మెంట్ కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు. ఇతర దేశాల విషయాని కొస్తే ఇథియోపియా తర్వాత తక్కువ వేతనాలు లభించే దేశంగా మడగాస్కర్ (రూ. 4,118) ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్ (రూ. 7121), పాకిస్థాన్ (రూ. 7292) ఉన్నాయి. రూ. 10896 లతో భారత్ తర్వాతి స్థానంలో ఉన్నది. మయన్మార్, కంబోడియాలు భారత్ తర్వాత ఉన్నాయి. భారత్ కంటే చైనాలో వస్త్ర కార్మికులకు అధిక వేతనం లభిస్తున్నది. ఇక్కడ వస్త్ర కార్మికులకు నెలకు రూ. 16,816 లు దక్కుతున్నాయి.