Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన శరత్‌చంద్రారెడ్డి, బినోయ్బాబుల జ్యుడీషియల్ రిమాండును రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం వారిద్దరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడి హాజరుపరిచింది. కేసు విచారిస్తున్న జస్టిస్ ఎంకె నాగ్‌పాల్ సెలవులో ఉండడంతో జస్టిస్ వికాస్ ధుల్ ధర్మాసనం విచారించింది. శరత్ చంద్రా రెడ్డిని ఇంకా విచారణ చేయాల్సి ఉందని, చార్జిషీటు దాఖలు చేయలేదని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం బినోరు, శరత్‌చంద్రా రెడ్డిల జ్యుడీషియల్ రిమాండు మరో 14 రోజులు పొడిగిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. మరోవైపు, శరత్‌చంద్రా రెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై ఈ నెల 13న విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.
అభిషేక్ బెయిలు రద్దు పిటిషన్ వాయిదా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అభిషేక్ బోయినపల్లి, విజరునాయర్ల బెయిలు రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఇరు పక్షాల న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది.