Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని హైకోర్టులకు సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : ప్రతిపాదిత ఆన్లైన్ ఆర్టీఐ పోర్టల్‌ల ఏర్పాటుపై మూడు వారాల్లోగా తమ స్పందనలను దాఖలు చేయాలని అన్ని హైకోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రవాసీ లీగల్ సెల్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఫైలింగ్ సమాచార హక్కు (ఆర్టీఐ) కోసం ఆన్లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది కేవలం తొమ్మిది హైకోర్టులు మాత్రమే తమ ప్రత్యుత్తరాలను దాఖలు చేశాయని న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. చాలా హైకోర్టులు ఇంకా ఆర్టీఐ పోర్టల్స్‌ను ప్రారంభించలేదని విన్న తరువాత సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. ఆన్లైన్ ఆర్టిఐ పోర్టల్‌ల ప్రతిపాదిత ఏర్పాటుపై తమ స్పందనను దాఖలు చేయని హైకోర్టులు మూడు వారాల్లో దాఖలు చేయాలని ఆదేశించారు.