Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బలవంతపు మత మార్పిడులను ఎదుర్కొనడం అనే పేరుతో సుదీర్ఘమైన వ్యాజ్యాలు న్యాయస్థానాల విలువైన సమయాన్ని హరించి వేస్తున్నాయి. దేశంలో మోసపూరితంగా జరుగుతున్న మత మార్పిడిని అణచివేయడానికి చర్యలు తీసుకో వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ విషయంలో వెనుకబడి వుండకూడదనుకుంటున్న గుజరాత్ ప్రభుత్వం కూడా తాము తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టంలోని నిబంధనపై స్టేను ఎత్తివేయాలని కోరుతోంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ మత మార్పిడైనా జరగడానికి ముందుగా జిల్లా మేజిస్ట్రేట్ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆ నిబంధన కోరుతోంది. గుజరాత్ మత స్వేచ్ఛా చట్టం, 2003 (వివాహం ద్వారా మత మార్పిడిని పొందుపరిచేందుకు 2021లో సవరించారు.) లోని సెక్షన్ 5పై గుజరాత్ హైకోర్టు సరిగానే స్టే విధించింది. మతాంతర వివాహాలను చట్ట విరుద్ధమైన మత మార్పిడులకు ఉదాహరణలుగా పేర్కొంటూ వాటిని కవర్ చేయాలని కోరుతున్న ఇతర నిబంధనల అమలుపై కూడా స్టే విధించింది. ముందస్తు అనుమతి తప్పనిసరనే ఈ నిబంధన వల్ల ఒకరు వారి మతాన్ని లేదా విశ్వాసాన్ని మార్చు కోవాలనుకుంటే దాన్ని ముందుగానే వెల్లడించాల్సి రావడం వారిపై ఒత్తిడిని పెంచుతుందని హైకోర్టు పేర్కొంది. వివాహం, నమ్మకం అనేవి ఒక వ్యక్తి స్వంత ఎంపికగా వుండాలని పేర్కొంటున్న సుప్రీం కోర్టు గత రూలింగ్‌లకు ఈ నిబంధన విరుద్ధంగా వుందని పేర్కొంది. సెక్షన్ 5పై విధించిన స్టే ఎలాంటి మోసం లేదా బలవంతం లేని వాస్తవమైన మతాంతర వివాహాలను కూడా దెబ్బతీస్తోందంటూ గుజరాత్ వాదించడం ఇక్కడ ఆశ్చర్యకరం. మతాంతర వివాహం పర్యవసానాలు ఏమైనా వున్నట్లైతే ఈ ముందస్తు అనుమతి తప్పనిసరి నిబంధన వల్ల మత మార్పిడి నిజమైన స్వభావాన్ని ప్రశ్నించాల్సిన అవసరం రాదన్న వాదన ఇందుకు ప్రాతిపదికగా వుంది.
విదేశీయుడికి నాలుగేళ్ల కస్డడియా?
- క్రిస్టియన్ మిచెల్ జేమ్స్‌పై సిబిఐ, ఇడికి సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ : అగస్టావెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడు క్రిస్టియన్ మిచెల్ జేమ్స్‌ను నాలుగేండ్లపాటు కస్టడిలో ఉంచడంపై సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వాస్తవం ఏదైనా ఒక విదేశీయుడ్ని అప్పగింత చట్టం ద్వారా భారత్‌కు తీసుకుని వచ్చి ఇన్ని ఏండ్లపాటు కస్టడీలో ఉంచడం అతని స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించింది. ఒకవేళ క్రిస్టియన్ మిచెల్ జేమ్స్ భారత దేశస్తుడయివుంటే బెయిల్ మంజారు చేసేందుకు కోర్టు మొగ్గు చూపేదని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను విచారించడానికి సీబీఐస ఇప్పటి వరకూ ఒక్క అనుమతి కూడా పొందలేకపొయిందని ధర్మాసనం ఆక్షేపించింది. 2003లో ఆగస్టా వెస్ట్‌లాండ్ నుంచి 12 వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలులో రూ. 3,600 కోట్ల కుంభకోణం జరిగిందని సిబిఐ, ఇడి ఆరోపిస్తున్నాయి. 2004లో ఈ స్కామ్‌పై కేసు నమోదయింది. ఇంగ్లండ్‌కు చెందిన మిచెల్ జేమ్స్‌ను 2018 డిసెంబరు4న దుబారు నుంచి భారత్‌కు రప్పించి అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను కస్టడీలోనే ఉన్నాడు. బెయిల్ కోసం జేమ్స్ దాఖలు చేసిన పిటీషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.