Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : జంతువుల హెల్త్‌కేర్ సొల్యూషన్స్, ఫీడ్ సంస్థ అజుని బయోటెక్ లిమిటెడ్ డిసెంబర్ 7 నుంచి రైట్ ఇష్యూను తెరుస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా రూ.29.01 కోట్ల నిధులను సమీకరించాలని నిర్దేశించుకున్నట్లు మంగళవారం ఆ సంస్థ తెలిపింది. ఈ నిధులతో మూలధన అవసరాలను తీర్చుకోనున్నట్లు వెల్లడించింది. ఈ ఇష్యూలో రూ.6 చొప్పున షేర్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 6తో ముగిసిన షేర్ విలువతో పోల్చితే 30 శాతం తగ్గింపును ఇస్తున్నట్లు పేర్కొంది. డిసెంబర్ 15న ఈ ఇష్యూను మూసివేయనున్నట్లు తెలిపింది.