Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్‌చార్జ్‌లను ఆ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే మంగళవారం నియమించారు. ప్రస్తుతం రాజస్థాన్‌కు ఇన్చార్జ్గా ఉన్న అజరు మేకన్ ఆ స్థానం నుంచి తొలగించి సుఖీజిందర్ సింగ్ రాంధవాను కొత్త ఇన్చార్జ్గా నియమించారు. ఛత్తీస్‌గఢ్‌లో పిఎల్ పునియాను తొలగించి కొత్త ఇన్చార్జ్గా కుమారి సెల్జాను నియమించారు. ప్రస్తుతం ఢిల్లీ ఇన్చార్జ్గా ఉన్న రాజ్యసభ సభ్యులు శక్తిసిన్హా గోహిల్‌కు హర్యానా ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం హర్యానా ఇన్చార్జ్గా ఉన్న వివేక్ బన్సాల్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు.