Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళలో ఎస్ఎఫ్ఐ నేతపై దాడి చేసిన ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. మెప్పాడి ప్రాంతంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో గత శుక్రవారం వయానాడ్ జిల్లా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) జాయింట్ సెక్రటరీ అపర్ణా గౌరీపై కొందరు విద్యార్థులు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అపర్ణా వయనాడ్‌లోని మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతోంది. ఈ దాడిలో ఓ పోలీస్ అధికారికి కూడా గాయాలయ్యాయని చెప్పారు. ఈ దాడికి సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని అన్నారు.