Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాయ్పూర్ : మోడీ ప్రభుత్వానికి చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సవాలు విసిరారు. మంగళవారం రాష్ట్ర రాజధాని రారుపూర్లోని ఇడి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం ఆందోళన చేపడుతోంది. ఈ నిరసనలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మోహన్ మార్కం, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపేష్ బఘేల్ మాట్లాడుతూ... ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఇడి, సిబిఐలను దుర్వినియోగం చేస్తోందని అన్నారు. ధైర్యముంటే.. మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఇడి విచారిస్తున్న సమయంలో కెమెరాలు అమర్చి ప్రత్యక్ష ప్రసారం చేయాలని అన్నారు. సోనియాగాంధీని ప్రశ్నిస్తున్న సమయంలో మీడియాను అనుమతించాలని అన్నారు. ఇడి ప్రశ్నలను, సోనియా సమా ధానాలను దేశం మొత్తం తెలుసు కోవాలను కుంటోందని అన్నారు. ఎక్కడ స్కామ్ జరిగిందో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని... మీకు ఆ ధైర్యముందా అని సవాలు విసిరారు. ఆరోగ్యం సరిగాలేని 75ఏళ్ల మహిళను ఇడి సమన్ల ద్వారా మోడీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. సోనియాగాంధీ నుండి లిఖితపూర్వక స్టేట్మెంట్ను తీసుకోకూడదా అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న చత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ను ఇడి అధికారులు ఎందుకు విచారించలేదని ఈ సందర్భంగా కేంద్రాన్ని నిలదీశారు.