Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిజియాత్రను ప్రారంభించిన ఎన్ఇసి
న్యూఢిల్లీ : దేశంలోని విమానాశ్రయాలలో బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ఫేసియల్ రికగ్నిషన్, బయోమెట్రిక్ సొల్యూషన్స్‌ను అందించే ఎన్ఇసి ఇండియా కొత్తగా డిజియాత్రను రూపొం దించినట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇటీవల వారణాసి ఎయిర్‌పోర్టులో ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎఫ్ఆర్టి), బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా ప్రయాణీకుల కాంటాక్ట్‌లెస్ బోర్డింగ్‌ను ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. డిజియాత్ర సౌలభ్యాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వర్చువల్‌గా ప్రారంభించారని పేర్కొంది. ఈ కాంటాక్ట్‌లెస్ బోర్డింగ్ సేవలను పొందేందుకు ప్రయాణీకులు తమ వివరాలను ముందుగా డిజియాత్ర యాప్‌లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసు కోవాల్సి ఉంటుందని తెలిపింది. డిజియాత్రను నిర్వహించేందుకు వారణాసి, కోల్‌కతా, పూణె, విజయవాడ లాంటి నాలుగు వేర్వేరు విమానాశ్రయాలలో దీన్ని అమలు చేయడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) నుండి 2019 ముగింపులో ఎన్ఇసి కాంట్రాక్టును సాధించినట్లు గుర్తు చేసింది.