Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
తిరుపతి: బీమాస్ రెసిడెన్షియల్ హౌటల్స్ అధినేత, బీమాస్ రఘు ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన స్థానిక సంకల్ప ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.40 నిమిషాలకు పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. బీమాసు రఘు మృతివార్త తెలిసి ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు శ్రేయోభిలాషులు కన్నీటి పర్యంతమయ్యారు. 1990లో కౌన్సిలర్‌గా, 1992లో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా త్యాగరాజు ట్రస్ట్ కమిటీ అధ్యక్షులుగా బీమాస్ రెసిడెన్సీ హౌటల్స్ అధినేతగా ఉంటూ ఆయన ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయనకు భార్య అలిమేలు, పెద్ద కుమారుడు బీమాస్ బాలాజీ, రెండవ కుమారుడు బీమాస్ అశోక్, ఒక కుమార్తె రమ్య ఉన్నారు. మంగళవారం శ్రీ హరిశ్చంద్ర శ్మశాన వాటికలో బీమాస్ రఘు అంత్యక్రియలు జరిగాయి.