Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లఖింపూర్ ఖేరి : గతేడాది అక్టోబరులో లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి కుమారుడు అశీష్ మిశ్రా, మరో 13మందిపై న్యాయస్థానం మంగళవారం అభియోగాలు నమోదు చేసింది. ఈ హింసాకాండలో నలుగురు రైతులు మరణించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా కుమారుడు అశీష్ మిశ్రా ఈ కేసులో ప్రధాన నిందితుడు. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 16న చేపట్టాలని అదనపు జిల్లా న్యాయమూర్తి సునీల్ కుమార్ వర్మ నిర్ణయించినట్లు జిల్లా ప్రభుత్వ న్యాయవాది (క్రిమినల్) అరవింద్ త్రిపాఠి తెలిపారు. మిశ్రాపై హత్య, హత్యా యత్నం, అల్లర్లు, ఆయుధాల చట్టం తదితర అభియోగాలను నమోదు చేశారు. మిశ్రా పెట్టుకున్న డిశ్చార్జ్ పిటిషన్ను సోమవారం ఖేరి జిల్లా కోర్టు తిరస్కరించింది.