Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భేటీ పడావో కార్యక్రమం ప్రకటనలకు రూ.401.04 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2014-15 నుంచి ఇప్పటి వరకు భేటీ పడావో కార్యక్రమానికి రూ.1,270 కోట్లు కేటా యించగా, అందులో రూ.774.25 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఖర్చు చేసిన మొత్తంలో రూ.401.04 కోట్లు కేవలం ప్రకటనలకే చేసినట్లు సమాధనంలో పేర్కొన్నారు. అందులో రూ.373.21 కోట్లు బాలికల కార్యక్రమాలకు ఖర్చు చేసినట్టు తెలిపారు.