Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాంలీలా మైదానంలో ఈపీఎస్ పెన్షనర్ల ధర్నా
న్యూఢిల్లీ : కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని ఈపీఎస్ పెన్షనర్లు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. బుధవారం నాడిక్కడ రాంలీలా మైదానంలో ఈపీఎస్ పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగా ల్, గోవాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెన్షనర్లు పాల్గొన్నారు. హైపర్ పెన్షన్ అందరికీ అమలు చేయాలనీ, భార్యా, భర్తలకు మెడికల్ సదుపాయాలు కల్పించాలనీ నినాదాలు చేశారు. పెన్షనర్ల కోఆర్డినేషన్ కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ధర్మజన్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, కార్యదర్శి రంగయ్య, ఆంధ్రప్రదేశ్ నుంచి అధ్యక్ష, కార్యదర్శలు శాస్త్రి, సుధాకర్‌తో పాటు అన్ని రాష్ట్రాల నుంచి నాయకులు పాల్గొని మాట్లాడారు.