Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యధికంగా రైల్వేలో 2,93,943 పోస్టులు
- రక్షణ రంగంలో 2,64,706, హోంశాఖలో 1,43,536 పోస్టులు ఖాళీలు
- లోక్సభలో కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్లలో 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. బుధవారం లోక్సభలో ఒకప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021 మార్చి 1 నాటికి 78 కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లలో 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇందులో అత్యధికంగా రైల్వేలో 2,93,943 పోస్టులు, రక్షణ రంగంలో 2,64,706 పోస్టులు, కేంద్ర హోం శాఖలో 1,43,536 పోస్టులు, పోస్టల్లో 90,050 పోస్టులు, రెవెన్యూలో 80,243 పోస్టులు, ఇండియన్ ఆడిట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 25,934 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మొత్తం 40,35,203 పోస్టులకు గానూ, దాదాపు పది లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు స్పష్టమైంది. ఈ డేటా ఏడాదన్నరకు కిందది. అయితే ఈ ఏడాదన్నరలో అనేక ఖాళీలు ఏర్పాడ్డాయి.
చేనేతకు జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచాలనే నిర్ణయం వాయిదా
చేనేతకు జీఎస్టీ 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలనే నిర్ణయం వాయిదా పడిందనీ, కనుక ప్రస్తుతం 5శాతమే కొనసాగుతోందని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన్ జర్దోష్ తెలిపారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చేనేత వస్త్రాలపై జీఎస్టీ 5శాతం నుంచి 12 శాతానికి పెంచాలనే నిర్ణయాన్ని వాయిదా పడిందనీ, అందువల్ల గార్మెంట్స్, బట్టలపై 5 శాతం జీఎస్టీ మాత్రమే కొనసాగుతోందని తెలిపారు. ఉపాధి కల్పనలో టెక్స్టైల్ రంగం చాలా ముఖ్యమైనదని తమ ప్రభుత్వానికి తెలుసన్నారు.