Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు చట్టంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టు, మహారాష్ట్రలోని ఎడ్ల బండ్ల పందేలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును భారత సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్‌లో పెట్టింది. ఈ రెండు క్రీడలను అనుమతించే తమిళనాడు, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల చట్టాలను సవాలు చేస్తూ జంతు హక్కుల సంస్థ పెటా సహా పలువురు సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం. జోసెఫ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృశికేశ్ రారు, జస్టిస్ సి.టి.రవికుమార్ లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కొందరు పిటిషనర్లు ఎద్దులను క్రూరత్వంగా చిత్రీకరించే ఛాయాచిత్రాల ఆధారంగా కోర్టు ఒక అభిప్రాయాన్ని కలిగిస్తే అది ''చాలా ప్రమాదకరమైన పరిస్థితి'' అని ధర్మాసనం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదంతో రాష్ట్ర సవరణ ద్వారా జంతువులపై క్రూర నిరోధక (పీసీఏ) చట్టం, 1960లో రూపొందించబడిన నిబంధనను తాము నిలుపుదల చేయలేమని వివరించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేటు శ్యామ్ దివాన్ వాదించారు. వార్త నివేదికలు, ఫోటోగ్రాఫ్‌లను చూపిస్తూ ఆటలో జంతువులపై క్రూరత్వం గురించి న్యాయస్థానానికి ఆయన నివేదించారు. తమిళనాడు తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.