Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: 2018-2021 మధ్య మూడేండ్లలో దళితులపై 1,89,945 అఘాయిత్యాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా గత మూడేండ్లలో దళితులపై దాడులకు సంబంధించి 1,89,945 కేసులు నమోదయ్యాయని, 2021లో 50,900 కేసులు నమోదయ్యాయని తెలిపారు. నమోదైన 1,89,945 కేసుల్లో 42,292 కేసుల్లో విచారణ పూర్తయిందని, 14,321 మందికి శిక్షలు పడ్డాయని వెల్లడించారు.
మూడేండ్లలో మహిళలపై 35,220 సైబర్ నేరాలు
మహిళలపై సైబర్ నేరాలకు సంబంధించి 2018-2021 మధ్య 35,220 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో ఒకప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. చాలా నేరాలు (5,587) సైబర్ అశ్లీలత, అశ్లీల లైంగిక అంశాలను హౌస్ట్ చేయడం, ప్రచురించడం వల్ల కేసులు నమోదు అయ్యాయి.