Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ప్రతిపక్షాల గెలుపు
న్యూఢిల్లీ : దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందింది. ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభను సమాజ్‌వాదీ పార్టీ కైవసం చేసుకోగా, రెండు అసెంబ్లీ స్థానాలకు ఆర్ఎల్డీ, బీజేపీ చెరొక్కటి సొంత చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవగా, ఒరిస్సాలో బీజేడీ గెలిచింది. బీహార్‌లో బీజేపీ సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ 2,88,461 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ షాక్యా (3,29,659)పై ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్ (6,18,120) ఘన విజయం సాధించారు. ఖతౌలీ అసెంబ్లీ స్థానంలో ఆర్ఎల్డీ అభ్యర్థి మధన్ భయ్య (97,139), బీజేపీ అభ్యర్థి రాజ్‌కుమారి(74,996)పై గెలిపొందారు. రాంపూర్‌లో బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా (81,432), ఎస్పీ అభ్యర్థి అసిం రాజా(47,293)పై గెలిపొందారు. ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మనోజ్ మాండవి (65,479) 21,171 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి బ్రహ్మానంద నేతమ్ (44,308)పై ఘన విజయం సాధించారు. రాజస్థాన్‌లోని సర్దర్శహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ శర్మ (91,357), బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ (64,505)పై ఘన విజయం సాధించారు. ఒరిస్సాలోని పదంపూర్‌లో బీజేడీ అభ్యర్థి బర్షా సింగ్ బరిహా (1,20,807), బీజేపీ అభ్యర్థి ప్రదీప్ పురోహిత్ (78,128)పై ఘన విజయం సాధించారు. బీహార్‌లోని కుర్హానీ అసెంబ్లీ స్థానంలో జేడీయూ అభ్యర్థి మనోజ్ సింగ్ (73,073)పై బీజేపీ అభ్యర్థి కేదార్ ప్రసాద్ గుప్తా (76,722) గెలిపొందారు.