Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1960లోఎంతుందో.. ఇప్పుడూ అంతే : ఆర్థిక నిపుణులు
- అందువల్లే ఉపాధి, వేతనాలు మెరుగుపడటం లేదు..
న్యూఢిల్లీ : ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా తయారీ రంగం అత్యంత కీలకమైంది. ఈ రంగంలో నమోదైన వృద్ధి..ఎంతోమంది తలసరి ఆదాయాల్ని పెంచుతుంది. గత దశాబ్దకాలంలో చైనా, బంగ్లాదేశ్ సాధించిన ప్రగతే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా చైనాలో తయారీ రంగం ఎన్నో కోట్లమందికి ఉపాధి లభిస్తోంది. వారి జీవన ప్రమాణాలు పెరగడానికి కారణమైంది. బంగ్లాదేశ్ లోనూ అదే ఫార్ములా అమలుజేశారు. తద్వారా అక్కడి ఉపాధి కల్పన, ఆదాయాలు పెరిగాయి. ఇటీవల కాలంలో ఆ దేశ వృద్ధి గణాంకాల్లో స్పష్టంగా కనపడింది. దీనికి గత దశాబ్దకాలంగా భారత్ ముందుకు వెళ్తోంది. తయారీరంగం మునుపెన్నడూ లేనంతగా బలహీనపడింది. 1960లో భారతదేశ జీడీపీలో తయారీరంగం వాటా ఎంతుందో..2023 సెప్టెంబర్లోనూ (రెండో త్రైమాసికం) అంతే ఉంది. అదేమాత్రమూ పెరగలేదు. దీనికి కారణం దేశంలో నయా ఉదారవాద విధానాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంస్కరణల పేరుతో సరళీకృత ఆర్థికవిధానాలు ప్రవేశించాయో, అప్పట్నుంచీ తయారీరంగం బలహీనపడిందన్నారు. గత 8ఏండ్లుగా మోడీ సర్కార్ కార్పొరేట్ అనుకూల విధానాల్ని బలంగా బలంగా అమలుజేస్తోంది. ప్రయివేటు పెట్టుబడిని పెంచడానికి అనేక ప్రయోజనాలు కల్పిస్తోంది. అయితే ఈ చర్యలేవీ దేశ ఉత్పత్తి రంగం ముఖచిత్రాన్ని మార్చలేక పోతున్నాయి. తయారీరంగంలో వృద్ధి గణనీయంగా దెబ్బతిన్నది. ప్రయివేటు పెట్టుబడులేవీ తయారీ రంగంలో మార్పులు తీసుకురాలేక పోయాయి.
జీవీఏ కీలకం
ఆర్థిక సంవత్సరం (2022-23) రెండో త్రైమాసికం వృద్ధి గణాంకాలు చూశాక..దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం దిశగా వెళ్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా తయారీరంగం నానాటికీ కుంచించుకు పోతోంది. ఇప్పుడున్న ద్రవ్యోల్బణం, ఎగుమతులను లెక్కలోకి తీసుకుంటే నమోదైన జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) 5.6శాతం చాలా తక్కువ. తయారీరంగం మైనస్ 4.3 శాతం, మైనింగ్ మైనస్ 2.8శాతం వృద్ధి నమోదుచేసింది. మొత్తంగా రెండో త్రైమాసికంలో జీడీపీలో వృద్ధి కేవలం 6.3శాతానికి పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు..ప్రస్తుతం విడుదలైన రెండో త్రైమాసికం గణాంకాలకు పొంతనలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. త్రైమాసిక గణాంకా లు ఆర్థిక వ్యవస్థలో వాస్తవ వృద్ధికి అద్దం పట్టవని, క్రితం ఏడాది త్రైమాసిక గణాంకాలతో పోల్చి చూసు కోవడానికి పనికొస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం రుణాల మంజూరు స్తం భించిపోయింది. బ్యాంకుల మొండిబ కాయిలు అనూ హ్యంగా పెరిగిపోయాయి. వ్యవసా యేతర రంగాల్లో తక్కువ వేతనాలు అమలవు తున్నాయి. పనిప్రదే శాల్లో లింగ వివక్ష పెద్ద ఎత్తున ఉంది. అంతేగాక దేశ ఎగుమతులు చాలా బలహీనం గా ఉన్నాయి. ఇవన్నీ మన ఆర్థిక వ్యవస్థలోని సూక్ష్మ మైన లోపాలకు అద్దం పడుతున్నాయి. మరో ముఖ్య మైన అంశం గత 10ఏండ్లుగా తయారీ రంగం దెబ్బ తింటోంది. వృద్ధి క్రమంగా క్షీణిస్తోంది. గత 60ఏం డ్లుగా తయారీ రంగంలో వృద్ధి పెద్దగా ఉండటం లేదు.