Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, కర్నాటక
- మూడో స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఏపీ
న్యూఢిల్లీ : దేశంలో ఐదేండ్లలో 28,572 మంది రైతులు ఆత్మహత్య లకు పాల్పడ్డారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. కేరళ ఎంపీలు సంతోష్ కుమార్, జోసి కె.మణి అడిగి ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమా ధానం ఇచ్చారు. 2017 నుంచి 2021 వరకు దేశంలో 28,572 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్ప డ్డారని తెలిపారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర (12,552) మొదటి స్థానంలో ఉండగా, కర్నాటక (6,095) రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో తెలంగాణ (3,055), నాలుగో స్థానంలో ఏపీ (2,413) ఉంది. ఐదో స్థానంలో మధ్యప్రదేశ్ (1,226) ఉంది. 2020 జులైలో కిసాన్ రైలును ప్రారంభించా మని, 2022 అక్టోబర్ 31 వరకు 167 రూట్లలో 2,359 సేవలను అందించిందని తెలిపారు. 22 రాష్ట్రా లు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,260 మండీల్లో ఈ-నామ్‌ను ప్రారంభించామని, 2022 అక్టోబర్ 31 వరకు 1.74 కోట్ల మంది రైతులు, 2.36 లక్షల మంది వ్యాపారస్తులు నమోదు చేసుకున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
పీఎం కిసాన్ నుంచి రెండు కోట్ల మంది రైతులు తొలగింపు
దీనివల్ల కేంద్రానికి రూ.5,108 కోట్లు మిగులు పీఎం కిసాన్ పథకం నుంచి రెండు కోట్ల మంది రైతులను తొలగించారు. ఈ మేరకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమా ధానం ఇచ్చారు. 2022-2023లో 11వ విడుత (ఏప్రిల్-జులై)లో 10,45,59,905 మంది రైతులకు లబ్ధి చేకూరితే, 12వ విడుత (ఆగస్టు-నవంబర్)లో 8,42,14,408 మంది రైతులకు మాత్రమే పీఎం కిసాన్ కింద జమ అయింది. 2,03,45,497 మం ది పీఎం కిసాన్ పథకం నుంచి తొలగి ంచబడ్డారు. ఏపిలో4,00,316 మంది ,తెలంగాణలో 3,05,425 మంది రైతులు పీఎం కిసాన్ నుంచి తొలగిం చబడ్డారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.5,108 కోట్లు మిగిలింది. 11వ విడుతలో రూ. 22,551 కోట్లు విడు దల చేస్తే, 12 విడుతలో 17,443 కోట్లు కేటాయించింది.
12.8 శాతం పెరిగిన క్యాన్సర్ కేసులు
దేశంలో 12.8 శాతం క్యాన్సర్ కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. 2020లో 13,92,179 కేసులు నమోదు అయ్యాయని, 12.8 శాతం పెరుగుతోందని తెలిపారు.