Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 68 శాతం యువత స్పందన
న్యూఢిల్లీ : ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లిళ్లు చేసుకుంటామని 68 శాతం మంది యువత ఓ సర్వేలో అభిప్రాయపడ్డారు. భారత్లో పెళ్లిళ్ల వ్యయానికి అప్పులిచ్చే 'బెట్టర్ హాఫ్' సంస్థ ఓ సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో 21-35 ఏళ్లలోని 2100 మంది అభిప్రాయాలను సేకరించింది. సొంత డబ్బులతోనే పెళ్లి చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకున్నామని 70 శాతం మంది యువత పేర్కొన్నారు. పెళ్లిళ్ల కోసం అప్పులు చేయడానికి బ్యాంక్లు, డిజిటల్ రుణ వేదికలను సంప్రదించనున్నామని 57 శాతం మంది అన్నారు. కేవలం 100 మంది బంధువుల మధ్యనే పెళ్లి చేసుకోవా లని భావిస్తున్నామని 53 శాతం మంది పేర్కొనడం విశేషం. 100-250 మంది అతిథుల మధ్య వివాహం చేసుకోవాలని భావిస్తున్నామని 31 శాతం మంది తెలిపారు. 250 పైగా అతిథులతో గొప్పగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని 16 శాతం మంది అభిప్రాయపడ్డారు.