Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : కాశ్మీరీ జర్నలిస్ట్ ఫహద్ షా కి స్థానిక కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఆన్లైన్ పోర్టల్ 'ది కాశ్మీర్ వాలా' ఎడిటర్ ఫహద్‌కి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఎ) యాక్ట్, 2008 కింద నియమించబడిన ప్రత్యేక కోర్టు బెయిల్ జారీ చేసిందని షా న్యాయవాది ఉమైర్ రోంగా ట్విట్టర్లో తెలిపారు. జర్నలిస్ట్‌పై జమ్ములో మరో కేసు పెండింగ్‌లో ఉందని అన్నారు. ప్రజా భద్రతా చట్టం కింద ఆయన నిర్బంధాన్ని కూడా సవాలు చేశామని, డిసెంబర్ 15 తేదీకి విచారణకు రానుందని రోంగా తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రశంసించడం, తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రజలను రెచ్చగొట్టడం వంటి ఆరోపణలపై ఫహద్ షాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం అరెస్ట్ చేసింది. షాకి వ్యతిరేకంగా జమ్ముతో పాటు పుల్వామా, షొపియాన్, శ్రీనగర్‌లలో కేసులు నమోదయ్యాయి.