Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లాజిస్టిక్ రంగం కోసం భారత్కు 250 మిలియన్ డాలర్ల పాలసీ ఆధారిత రుణాన్ని అందించనున్నట్లు ది ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడిబి) శుక్రవారం తెలిపింది. లాజిస్టిక్స్ సదుపాయాలను బలోపేతం చేసేందుకు, ఆధునీకరించడమే లక్ష్యంగా, మరింత సమర్థవంతంగా, తక్కువ వ్యయంతో ముందుకు తీసుకువెళ్లేందుకు తోడ్పడనున్నట్లు ఎడిబి పేర్కొంది. సమాఖ్య, రాష్ట్ర, నగర స్థాయిలో సమగ్ర విధానం, ప్రణాళిక మరియు సంస్థాగత చర్యలను రూపొందించడానికి వీలుగా ప్రభుత్వ మొదటి సబ్ ప్రోగ్రామ్కి ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపింది. దేశంలో అధిక ధరలను హేతుబద్ధం చేయడంతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గిస్తుందని పేర్కొంది. పంపిణీ గొలుసును మెరుగుపరచడంతో పాటు ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తుందని ఎడిబి వెల్లడించింది.