Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజింజం ఓడరేపు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనలకు ముగింపు
తిరువనంతపురం: కేరళలో విజింజం ఓడరేపు నిర్మాణానికి వ్యతిరేకంగా జరుపుతున్న ఆందోళనలకు ముగింపు పలకడానికి నిరసనకారులు బృందం అంగీకరించింది. చర్చల్లో పినరయి విజయన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అలాగే విజింజం ఓడరేవు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలనే తమ ప్రధాన డిమాండ్‌ను విరమించుకుంది. దీంతో ఓడరేవు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా లాటిన్ ఆర్చ్ డియోసెస్ పూజారుల నేతృత్వంలో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలీసు స్టేషన్‌పై దాడి చేసి పత్రాలు, వాహనాలను ధ్వంసం కూడా చేశారు. ముఖ్య మంత్రి పినరయి విజయన్ నిర్వ హించిన సమావేశంలో నిరసనల ను ఉపసంహరించుకుంటామ ని తెలిపారు.
నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని మినహా మిగిలిన అన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో గత 138 రోజుల నుంచి జరుగు తున్న నిరసనలను నిలిపివేస్తా మని తెలిపారు. అలాగే ఆమోది ంచిన డిమాండ్ల అమలుకు పర్య వేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.