Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత విలువైన అగ్రశ్రేణీ 500 కంపెనీల్లో భారత్కు చెందిన 20 కంపెనీలు చోటు దక్కించు కున్నాయని హురున్ రీసెర్చ్ ఇన్స్ట్యూట్ వెల్లడించింది. గతేడాది ఈ జాబితాలో 8 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ''2022 హురున్ గ్లోబల్ 500'' నివేదికన హురున్ రీసెర్చ్ ఇన్స్ట్యూట్ శుక్రవారం వెల్లడించింది. భారత్లో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ కంపెనీ 202 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా 34వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే టాప్ 500 కంపెనీల విలువ 11.1 ట్రిలియన్ డాలర్లు తగ్గింది. గ్లోబల్ కంపెనీల్లో ఆపిల్ 2.4 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్లో 139 బిలియన్ డాలర్లతో రెండో అతిపెద్ద కంపెనీగా టిసిఎస్ నిలిచింది. అదానీ గ్రూపులోని అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీలు టాప్ 500లో ఉన్నాయి.