Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెనక్కి తగ్గేది లేదు
- దీపమ్ సెక్రటరీ తుహిన్ పాండే వెల్లడి
- డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని చేరుతాం
న్యూఢిల్లీ : రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ స్టీల్ ప్లాంట్)ను అమ్మి తీరుతామని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) సెక్రటరీ తూహిన్ కాంత్ పాండే స్పష్టం చేశారు. ప్రయివేటీకరణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని తెలి పారు. శుక్రవారం జరిగిన సిఐఐ గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్‌లో పాండే మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌లో 100 శాతం వాటాల విక్రయానికి 2021 జనవరిలోనే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిం దన్నారు. ఈ ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లే పనిలోనే తాము ఉన్నామ న్నారు. విశాఖ స్టీల్ అమ్మకానికి వీలుగా లావాదేవీల ప్రక్రియ ఎలా ఉండా లనే దానిపై కసరత్తు చేస్తున్నామని తూహిన్ పాండే తెలిపారు. విశాఖ స్టీల్‌ను ప్రయివేటుకు కట్టబెట్టడాన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ లో పర్యటించిన సమయంలోనూ తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంస్థను ప్రయివేటుపరం కానివ్వబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ లక్ష్యాన్ని 2023 మార్చి ముగింపు నాటికి చేరుకోనున్నామని పాండే తెలిపారు. ''2023-23లో రూ.65,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇందులో ఇప్పటికే రూ.38,382 కోట్ల విలువ చేసే వాటాల విక్రయం జరిగింది. పిఎస్‌యుల డివిడెండ్లతో కలిపి రూ.62,433 కోట్ల నిధులు ప్రభుత్వానికి చేరాయి.'' అని పాండే తెలిపారు. రూ.65వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని చేరడానికి త్వరలోనే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జడ్‌ఎల్)లోని వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నామన్నారు. మరికొన్ని సిపిఎస్యుల్లోనూ వాటాల ఉపసంహరణ ఉంటుందన్నారు.
ఐడిబిఐ బ్యాంక్ బిడ్ల స్వీకరణకు గడువు పెంపు
ప్రభుత్వ రంగంలోని ఐడిబిఐ బ్యాంక్ ప్రయివేటీకరణకు సంబంధించిన బిడ్ల స్వీకరణ గడవును కేంద్రం పొడగించే అవకాశం ఉందని సమాచారం. ఇందులోని 60.72 శాతం వాటాల విక్రయానికి గాను ప్రాథమిక బిడ్ల స్వీకరణ డిసెంబర్ 16తో గడువు ముగియనుంది. దీన్ని నెల రోజుల పాటు పొడిగించి.. జనవరి మధ్య నాటికి బిడ్లను స్వీకరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐడిబిఐలో ఎల్ఐసి, ప్రభుత్వానికి సంయుక్తంగా 94.71 శాతం వాటా ఉంది. ఈ బ్యాంక్‌లోని మెజారిటీ వాటాలను విదేశీ కంపెనీలకు కట్టబెట్టడానికి వీలుగా ఇటీవల మోడీ సర్కార్ నిబంధనలను సవరించింది.