Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ సిఎంగా ముఖేశ్ అగ్నిహోత్రి
- నేడు ప్రమాణ స్వీకారం
షిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖు బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరును ఖరారు చేసింది. డిప్యూటీ సిఎంగా ముఖేశ్ అగ్నిహోత్రి పేరును ఖరారు చేసిందని ఛత్తీస్గఢ్ సిఎం భూపేశ్ బఘేల్ తెలిపారు. వీరిద్దరూ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారితోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పిసిసి అధ్యక్షులు ప్రతిభాసింగ్, సుఖ్విందర్ సింగ్ సుఖు, ముఖేశ్ అగ్నిహౌత్రి సిఎం పదవి కోసం ప్రయత్నించారు. చివరికి కాంగ్రెస్ హైకమాండ్ సుఖ్విందర్ సింగ్ పేరును ఖరారు చేసింది. మరో నేత ముఖేశ్ అగ్నిహోత్రికి డిప్యూటీ సిఎంగా బాధ్యతలు అప్పగించింది. లోక్సభ సభ్యురాలిగా ఉన్న ప్రతిభాసింగ్కు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామని చెప్పి ఒప్పించింది.