Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: నిందితుల విడుదల, రెమిషన్ను సవాలు చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్పై భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 13న విచారణ జరుపనున్నది. 2002లో బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడికి తెగబడి, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని నిందితులు హత్య గావించటం అప్పట్లో తీవ్ర సంచలనం రేపిన విషయం విదితమే. గోద్రా రైలు దహనం ఘటన తర్వాత 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై ఈ దారుణం జరిగింది. ఆ సమయంలో ఆమె ఐదు నెలల గర్భిణి. అయితే, ఈ కేసుకు సంబంధించి 11 మంది నిందితులు ఈ ఏడాది ఆగస్టు 15న విడుదలైన విషయం తెలిసిందే. నిందితుల విడుదలపై దేశవ్యాప్తంగా పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వీరి రెమిషన్, విడుదలను సవాలు చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ అజరు రస్తోగి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. గుజరాత్ ప్రభుత్వం నిందితులను త్వరగా విడుదల చేయటం గురించి రెండు వేర్వేరు పిటిషన్లలో బిల్కిస్ బానో సవాలు చేశారు. '' మరోసారి నిలబడి న్యాయం తలుపులు తట్టాలనే నిర్ణయం నాకు అంత సులభం కాదు. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులు విడుదలైన తర్వాత నేను నిస్సత్తువగా ఉన్నాను. నేను షాక్తో పక్షవాతానికి గురయ్యాను'' అని పిటిషన్ల దాఖలు సమయంలో బిల్కిస్ బానో బాధను వ్యక్తం చేశారు.