Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడులో బీభత్సం : నలుగురి మృతి
చెన్నై: మాండూస్ తుపాను తమిళనాడులో బీభత్సం కలిగించింది. తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు సముద్ర తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో పలుచోట్ల భారీ వక్షాలు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి తటాకాలను తలపిస్తున్నాయి. తమిళనాడులో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 98 పశువులు మృతి చెందాయి. 181 నివాసాలు దెబ్బతిన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రమాద వివరాలను మీడియాకు తెలియజేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను ఆయన శనివారం పరిశీలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అంధకారం నెలకొన్నది. ఆగేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడిందని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. తమిళనాడులో మరో రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లు చెప్పారు.