Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేష్ గుప్తా ఆదివారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సూచనల మేరకు ఢిల్లీ బీజేపీ చీఫ్ పదవికి ఆదేష్ గుప్తా రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదేశ్ గుప్తా రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్దేవను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమి నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం ఈ మార్పులు చేసింది.