Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14న ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభం
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
న్యూఢిల్లీ : 14 న(బుధవారం) దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా యాగం కూడా నిర్వహిం చనున్నారు. ప్రారంభోత్సవం, యాగం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు,గృహ నిర్మాణ శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమారు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక యాగం కోసం నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనంలో చేపట్టాల్సిన మమమ్మతులు, కార్యాలయ ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు.