Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూజువాణి ఓటుతో రాజ్యసభ అనుమతి
- దేశ సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకం వి.శివదాసన్
న్యూఢిల్లీ : ఇంధన పరిరక్షణ బిల్లు ఆమోదం పొందింది. సోమవారం రాజ్యసభలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ ఇంధన పరిరక్షణ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్‌ను పేర్కొనడానికి కేంద్రానికి అధికారం కల్పిం చడం లక్ష్యంగా పెట్టుకున్న ఈబిల్లుపై రాజ్య సభలో చర్చ జరిగింది. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకున్నారు. సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ మాట్లాడు తూ సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ బిల్లులో ప్రస్తా వించలేదు. కేంద్రీకరణ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. అధికారా లన్ని కేంద్రం చేతుల్లో పెడుతూ బిల్లులో పేర్కొన్నా రని విమర్శించారు. దేశం ప్రాధమిక సూత్రం వికేంద్రీకరణ అనీ, ఈ బిల్లు దేశ సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమని అన్నారు. దేశ సమాఖ్య వ్యవస్థను పరి రక్షించాలని, వికేంద్రీకరణను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీని ప్రతిపాదిస్తుందని, ఇందులో కూడా కేంద్రీకరణ విధానాన్నే అమలు చేశారని విమర్శిం చారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీలో కేవలం ఐదు రాష్ట్రాలకే ప్రాతినిధ్యం ఉంటుందని బిల్లులో పేర్కొన్నారని, దీనివల్ల మెజార్టీ రాష్ట్రాల అభిప్రాయాలు అందులో నమోదు కావని అన్నారు. దీనివల్ల రాష్ట్రాల హక్కుల కు కోత పెడుతోందని విమర్శించారు. అన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలను చెప్పడం వాటి హక్కు అని, కనుక అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండాలని డిమాండ్ చేశారు. ఇందులో రైతుల ప్రతినిధులు కూడా లేరని, దేశంలో 30 శాతం విద్యుత్ వినియోగం వ్యవసాయరంగం చేస్తోందనీ, కానీ ఈ బిల్లులో వ్యవసాయ రంగాన్ని పరిగణనలోకి తీసుకో లేదని అన్నారు.
ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీలో పారిశ్రామి క వేత్తలు, బడా ఉత్పత్తిదారులతో సహా బడా కార్పొ రేట్లు కూడా ఉన్నారనీ, ఎందుకు రైతులు, కార్మికులను అనుమతించటం లేదని ప్రశ్నించారు. రైతులు, కార్మికుల ప్రతినిధులను కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్బన్ ట్రేడింగ్, ఎనర్జీ కన్జర్వేషన్ పద్ధతులు రాష్ట్రాల మధ్య వేర్వేరుగా ఉన్నాయని, రాష్ట్రాల ప్రత్యేకమైన అంశాలను కూడా ఉన్నాయని తెలిపారు. దీనిలో కూడా అన్ని రాష్ట్రాలకు హక్కు కల్పించాలని కోరారు. వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఈ బిల్లును సమర్థిస్తూనే కొన్ని సూచనలు చేశారు.