Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోట్ల సంఖ్యలో సభ్యత్వాలు.. ఓట్లలో ప్రతిబింబించని లెక్కలు
- పలు రాష్ట్రాల ఎన్నికల గణాంకాలు వెల్లడి
- ప్రజాగ్రహాన్ని చూపిన హిమాచల్ తీర్పు : రాజకీయ విశ్లేషకులు, నిపుణులు
న్యూఢిల్లీ : ఇటీవలి రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోడీ గతవారం వీర 'విజయం దినం' ప్రసంగం చేశారు. బీజేపీకి 'పెరుగుతున్న ప్రజా మద్దతు', 'ఆశ్రిత పక్షపాతం, అవినీతి'కి వ్యతిరేకంగా పెరుగుతున్న ప్రజాగ్రహాన్ని చూపుతుందని నొక్కి చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలు అసలైన ప్రజా తీర్పును వెల్లడించాయని ప్రతిపక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఈ ఎన్నికలు నిజంగా ప్రజాగ్రహాన్ని చూపాయని తెలిపారు. బీజేపీ తమ పార్టీలో కోట్లాది మంది సభ్యలున్నారని చెప్పుకుంటున్నదనీ, అది మాత్రం ఎన్నికలలో ప్రతిబింబించటం లేదని చెప్పారు. అయితే, ఈ విజయం మోడీ చెప్పుకుంటున్నట్టు సాధించిన విషయం కాదని చెప్పారు. 2019 ఆగస్టు 20 నాటికి బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ ముగిసినప్పుడు అప్పటి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించినట్టు పార్టీకి 18 కోట్ల మంది సభ్యులున్నారు. ఇది 2015లో పార్టీకి ఉన్నదాని కంటే ఏడు కోట్లు ఎక్కువ. ఆ ఏడాదే బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించినట్టు చెప్పబడింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ 22.80 కోట్ల ఓట్లు సాధించినందున మోడీ ఓటర్లలో 78 శాతం మంది బీజేపీ సభ్యులుగా మారారని ఊహించబడింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పొందుతున్న ఓట్లు.. అది వెల్లడించుకుంటున్న గణాంకాలతో పోలటం లేదని విశ్లేషకులు చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను చూస్తే.. 2017లో ఆ పార్టీ 18.46 లక్షల ఓట్లను సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో అది 26.61 లక్షలుగా నమోదైంది. 2022 ఎన్నికలలో ఇది కేవలం 18.14 లక్షలకు తగ్గింది. గుజరాత్లో బీజేపీకి ఈ సారి 1.67 కోట్ల ఓట్లే వచ్చాయి. అయితే, పెరిగిన సభ్యత్వంతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
హర్యానాలో, 2014 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 41.25 లక్షల ఓట్లను సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో 73 లక్షలకు పెరిగినప్పటికీ.. 64 శాతంగా పెరిగిన పార్టీ సభ్యత్వంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. జార్ఖండ్‌లో 2014లో బీజేపీకి 43 లక్షల ఓట్లు రాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి 50 లక్షల ఓట్లే వచ్చాయి. ఢిల్లీలో 2019లో ఆ పార్టీకి 49 లక్షల ఓట్లు రాగా, 2020 అసెంబ్లీ ఎన్నికల నాటికి 35.75 లక్షలకు పడిపోవటం గమనార్హం. యూపీలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 3.44 కోట్ల ఓట్లు రాగా, 2022కు స్వల్పంగా పెరిగి 3.80 కోట్లుగా నమోదు కావటం ఆపార్టీ ప్రదర్శనకు అద్దం పడుతున్నది. మొత్తానికి బీజేపీ చెప్పిన కోట్లాది సభ్యత్వం వట్టి మాటలేనన్న విషయం పలు రాష్ట్రాల ఎన్నికలను చూస్తే అర్థమవుతుందని విశ్లేషకులు చెప్పారు.ఎప్పటిలాగే ప్రధాని మోడీ తన టీంలోని పెద్దలపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతున్నారని నిపుణులు తెలిపారు. ఇందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో ఆ పార్టీ ఓటమిని ఎత్తి చూపారు. ఇక్కడ ఆ పార్టీ అపూర్వమైన తిరుగుబాటును చూసిందన్నారు. అయితే, ఈ ఓటమికి బాధ్యత వహించాల్సిన విషయాన్ని చర్చకు రానీయకండా గుజరాత్ విజయంతో కప్పి పెట్టాలని బీజేపీ చూస్తున్నదన్నారు. పైగా వచ్చే నెలలో పూర్తి కానున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడగించొచ్చనే అంతా భావిస్తున్నారు. నైతిక విలువల గురించి మాట్లాడే బీజేపీ ఈ విషయంలో ఎలా సమర్థించుకుంటుందని విశ్లేషకులు ప్రశ్నించారు.నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో ఆ పార్టీ ఓటమిని బట్టి చూస్తే.. కాషాయ పార్టీలో జవాబుదారీతనం కంటే 'విధేయత'కే ప్రాధాన్యమన్నది అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఈ 'విధేయత' మోడీ, షా ద్వయం ముందు చూపాల్సి ఉంటుందనీ, ఈ విషయంలో నడ్డా పలు సందర్భాలలో చాటుకున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది బీజేపీ ఓటు షేర్ దాదాపు ఆరుశాతం పాయింట్లకు తగ్గింది. 2017లో ఇది 48.79 శాతంగా ఉండగా, అది 43 శాతానికి పడిపోయింది. ఇక గుజరాత్లో విజయానికి బీజేపీ.. ఆప్‌నకు కృతజ్ఞతగా ఉండాలనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చటంలో కేజ్రీవాల్ పార్టీ సక్సెస్ అయ్యి కాషాయ పార్టీకి రికార్డు స్థాయి విజయాన్ని సునాయాసం చేసిందని విశ్లేషకులు చెప్పారు. ఆప్ పోటీలో లేకుంటే కాంగ్రెస్‌కు 33 ఎక్కువ సీట్లు వచ్చి బీజేపీ మెజారిటీ తగ్గేదని తెలిపారు.