Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం టార్గెట్
- ఖాతాదార్లకు ఇష్టంలేకున్నా..పీఎం జీవన్‌జ్యోతి, సురక్ష బీమా, అటల్ పెన్షన్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు బీమా పథకాల్ని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులపై మోడీ సర్కార్ బలవంతంగా రుద్దుతోంది. తమ ఖాతాదార్లందరితోనూ బీమా పథకాల్ని చేయించాలని బ్యాంకులపై ఒత్తిడి చేస్తోంది. దీంతో ఆయా బ్యాంకులు తమ ఖాతాదార్లకు పీఎం బీమా జ్యోతి (లైఫ్ ఇన్సూరెన్స్), పీఎం సురక్ష బీమా యోజన (ప్రమాద బీమా), అటల్ పెన్షన్ యోజన..వంటివి అంటగడుతున్నాయి. పలు రకాల బీమా పథకాల్ని అక్రమ పద్ధతుల్లో, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు ఖాతాదార్లకు ఇస్తున్నారనే విషయం ఆర్టీఐ దరఖాస్తుకు బ్యాంకులు విడుదల చేసిన సమాచారం బయటపెట్టింది. బీమా పథకాల్ని చేయించటంపై బ్యాంకు ఉన్న తాధికారులకు కేంద్రం టార్గెట్ విధించిందని బ్యాంకుల అంతర్గత లేఖల్లోని సమాచారం ద్వారా బయటకొచ్చింది.ఈ సమాచారం ప్రకారం, బీమా సేవల్ని ఖాతాదార్లు కోరుకోకున్నా..వాటిని బలవంతంగా అంటగడు తున్నారు. ఇందుకోసం ఖాతాదార్ల నుంచి రుసుములు వసూలు చేయాల్సి వస్తోంది. ''బీమా పథకాల ప్రయోజనాలపై ఖాతాదార్లను మభ్యపెడుతూ బీమాలను అంటగట్టాల్సి వస్తోంది. ఎన్నో అబద్ధాలు, నిబంధనలకు విరుద్ధంగా ఖాతాదార్లకు అంటగడుతున్న వైనంపై వీడియో, ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి'' అంటూ మీడియాకు విడుదలైన ఆర్టీఐ సమాచారం వెల్లడించింది. మే 2015లో పలు బీమా పథకాల్ని మోడీ సర్కార్ ప్రవేశపెట్టింది.