Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో ఎంఎఎన్ఎఫ్ రద్దుపై ఆందోళన
- విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా
- వందలాది మంది విద్యార్థులు అరెస్టు.. పలువురికి గాయాలు
న్యూఢిల్లీ: మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్‌ల రద్దుకు వ్యతి రేకంగా ఆందోళన చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు జులుం ఝుళిపిం చారు. వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి, మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులను రోడ్డుపై ఈడ్చుకుంటూ బస్సుల్లో, పోలీస్ వ్యానుల్లో కుక్కారు. పదుల సంఖ్యలో విద్యార్థినీలపై మగ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. చాలా మంది తీవ్రంగా గాయ పడ్డా రు. పోలీసుల చర్యలతో కొంత మంది విద్యార్థులు. స్పృహతప్పి అక్కడిక్కడే పడిపోయారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (ఎంఎఎన్ఎఫ్) పథకాన్నిరద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐతో పాటు ఇతర విద్యార్థి సంఘాలు విద్యా మంత్రిత్వ శాఖ ముందు ప్రదర్శన నిర్వ హించాయి. మైనార్టీ వర్గాల విద్యార్థులు ఇతర పథకాల పరిధిలోకి వచ్చినం దున ఎంఎఎన్ఎఫ్ స్కాలర్షిప్ను ఉపసంహరించుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపిందని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. ఎంఎఎన్ ఎఫ్ 2008లో బౌద్ధ, క్రిస్టియన్, ముస్లిం, పార్సీ, సిక్కు, జైన్ వంటి ఆరు నోటిఫైడ్ మైనార్టీ వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టబడిందనీ, దాన్ని రద్దు చేయడం వంటి చర్య ఈ విద్యార్థులకు పెద్ద దెబ్బగా మారుతుందని తెలిపారు. భవి ష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశను పూర్తిగా నాశనం చేస్తుం దని అన్నారు. ఫెలోషిప్ విడుదలలో తొమ్మిది నెలల ఆలస్యం కారణంగా, పెరుగుతున్న ఆర్థిక భారం కారణంగా అనేక మంది విద్యార్థులు తమ పరి శోధన పనికి విరామం ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఎంఎఎన్ఎఫ్ రద్దును వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుందని ఎస్ఎఫ్ఐ నేతలు అన్నారు. అనంతరం విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థినీలతో సహా అనేక మంది విద్యార్థులను బలవంతంగా ఈడ్చికెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థినీలపై మగ పోలీసు అసభ్యంగా ప్రవర్తించారు. పోలీస్ చర్యలను ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది.