Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 మంది మంత్రులు కూడా
- హాజరైన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్రపటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆయన వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. గాంధీనగర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, సీఎంలు, ప్రముఖులు హాజరయ్యారు. కొత్త సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సీఎంగా పటేల్‌తో ప్రమాణం చేయించారు. దీంతో భూపేంద్ర పటేల్ రాష్ట్ర 18వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గుజరాత్ క్యాబినెట్లో బీజేపీ నేతలు హర్ష సంఘవి, జగదీశ్ విశ్వకర్మ, నరేశ్ పటేల్, బచుభారు ఖబద్, పర్షోత్తమ్ సోలంకి లు సహా మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, అసోం సీఎం హిమంత విశ్వ శర్మ, ఉత్త రాఖండ్ సీఎం పుష్కర్ ధామి, త్రిపుర సీఎం మాణిక్ సాహాలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. డిసెంబర్ 8న జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ విజయం సాధించిన విషయం విదితమే.