Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభలో హిందీ దుమారం
న్యూఢిల్లీ : పార్లమెంటులో కాంగ్రెస్ తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ల మధ్య వివాదం నెలకొంది. హిందీ బాషపై వారిద్దరి మధ్య వాడివేడిగా సంభాషణ జరిగింది.అమెరికా డాలర్‌తో పోల్చితే మన దేశ కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకూ తగ్గిపోతున్న విషయాన్ని ప్రభుత్వం గమనించిందా? అని ఆయన నిలదీశారు. దీనికి నిర్మల బదులిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ ఉంటే పార్లమెంటులో కొందరికి అసూయగా ఉందని ఆరోపించారు. దేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ఇది ప్రతిపక్షాలకు సమస్యగా మారిందని అన్నారు. దేశ అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. అయితే కొందరు మాత్రం దీనిని ఓ పరిహాసంగా, జోక్‌గా తీసుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి దేశ కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకూ క్షీణిస్తోందని, ఒక డాలర్‌కు రూ.83 స్థాయికి పతనమైందని అన్నారు. ఇంత క్షీణత నమోదు కావడం ఇదే మొదటిసారని, దీనిని ప్రభుత్వం గమనించిందా? అని ప్రశ్నించారు. పతనాన్ని నిలువరించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలేమిటి? ప్రభుత్వం వద్ద ఓ కార్యాచరణ ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించారు. 2013లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధాని మోడీ చేసిన విమర్శలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ''నేడు రూపాయి ఐసీయూలో ఉన్నది. తమిళులు ఈ వ్యక్తిని (ఆర్థిక మంత్రి చిదంబరం) ఢిల్లీకి ఎందుకు పంపించారో నాకు అర్థం కావడం లేదు'' అని మోడీ 2013 అక్టోబరులో ట్వీట్ చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రూపాయిని ఐసీయూ నుంచి తిరిగి ఇంటికి తీసుకురావడానికి ప్రభుత్వం వద్ద కార్యాచరణ ప్రణాళిక ఏదైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నిర్మల సీతారామన్ సమాధానం చెప్తూ, ప్రతి కరెన్సీతోనూ భారతీయ రూపాయి బలంగా ఉందని చెప్పారు. రిజర్వు బ్యాంకు విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించిందని, డాలర్ రూపాయి హెచ్చుతగ్గులు మితిమీరకుండా చూసేందుకు మార్కెట్లో జోక్యం చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంలోనే తెలంగాణ నుంచి వచ్చిన సభ్యులకు హిందీ సరిగా రాదు (కమ్ జోర్ హై), నాకూ సరిగా హిందీ రాదు (మేరా హిందీ భీ కమ్ జోర్ హై) సరిగా లేని హిందీ ప్రశ్నకి, సరిగా రాని హిందీలోనే జవాబు చెబుతాను అని నిర్మల అన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి తాను శూద్రుడినీ అని, తనకు సరిగా హిందీ రాదని, బ్రాహ్మణవాదులే సరైనా హిందీ మాట్లాడుతారని ఎద్దేవా చేశారు.స్పీకర్ జోక్యంతో వారిద్దరి మధ్య రగడ సద్దుమణిగింది. కాగాలోక్సభలో ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. కరెన్సీ నోట్ల నుంచి మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలగించే ఆలోచన లేదని లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.