Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి జాతీయ నేతల ఆహ్వానం..!
- రేపు పార్టీ కార్యాలయం ప్రారంభం
న్యూఢిల్లీ : రేపు (బుధవారం) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయం ప్రారంభం కానున్నది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఢిల్లీ ఎస్పీ రోడ్లో బిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను టీఆర్ఎస్ ఎంపీలు నామ నాగేశ్వరరావు , రాములు, దయాకర్, బడుగు లింగయ్య యాదవ్, బిబి పాటిల్ పరిశీలించారు. బిఆర్ఎస్ కార్యాలయంలో యాగశాల ఏర్పాటు చేశారు. మూడు హౌమ గుండాలు ఏర్పాటు చేశారు. 12 మంది రిత్వికుల ఆధ్వర్యంలో ఈ యాగాలు జరగనున్నాయి.శృంగేరి పీఠం గోపిశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతాయి. దేశం సుభిక్షంగా ఉండాలని యాగం చేస్తున్నామని ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ అన్నారు. ఢిల్లీలో కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామనీ, జాతీయ పార్టీ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని వినూత్న సంక్షేమ పథకాలు తీసుకొచ్చారనీ, దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బిఆర్ఎస్ పార్టీ స్థాపన జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి తోపాటు, ఇకనుంచి దేశ అభివృద్ధి కూడా తమ పార్టీ నినాదమన్నారు. ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఈనెల 14 నుంచి అందుబాటులో ఉంటుందని, తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని, పక్కనున్న రాష్ట్రాలు కూడా తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. పార్లమెంట్లో పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలతో కూడా చర్చించుకుంటున్నామని, కేంద్రంలో రైతు సంక్షేమ పార్టీ అధికారంలోకి రావాలని తమ ధ్యేయమని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని పనులు రాష్ట్రంలో చేశామని, బడుగు బలహీన వర్గాల .అభివృద్ధి ధ్యేయంగా పార్టీ స్థాపన జరిగిందని పేర్కన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. పార్టీ కార్యాలయం ప్రారంభానికి కొంతమంది జాతీయ నాయకులను ఆహ్వానించామని, మంగళవారం స్పష్టత వస్తుందని అన్నారు.