Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిహద్దుపై దద్దరిల్లిన ఉభయ సభలు
- సమాధానం చెప్పాలని ప్రతిపక్షాల పట్టు
- కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్‌లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అంశాన్ని లేవనెత్తాయి. ఆయా పార్టీ ల సభ్యులు తమ స్థానాల్లో లేచి దీని పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ, ఎంఐఎంతో సహా ప్రతిపక్షాలన్ని డిమాండ్ చేశారు.ఓవైపు ప్రతిపక్షాల నిరసనల మధ్యనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహిం చేందుకు ప్రయత్నించారు. కానీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి జోక్యం చేసుకొని ప్రతిపక్ష పార్టీలన్నీ సరిహద్దు అంశాన్ని లేవనెత్తాయనీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేస్తారని తెలిపారు. ప్రశ్నోత్తరాలు నిర్వ హించాలని కోరారు. అందుకు ప్రతిపక్షాలు ససేమిరా అన్నాయి. ముందు తవాంగ్ ఘటనపై సమాధానం చెప్పి తీరాల్సిందేనని పట్టు పట్టాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. తొమ్మిది నిమిషాల్లో సభను గంట పాటు వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ప్రకటన చేశారు. డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చడానికి ఆర్మీ దళాలు ప్రయత్నించాయని అన్నారు. ''ఈ ముఖాముఖి పోరాటంలో ఇరువైపులా కొద్ది మంది సైనికులు గాయపడ్డారు. ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. దేశ సైనికులెవరూ చనిపోలేదు. తీవ్రంగా గాయపడలేదు'' అని తెలిపారు. ''ఈ అంశాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాతో కూడా తీసుకోబడింది. మన సరి హద్దులను రక్షించడానికి మన బలగాలు కట్టుబడి ఉన్నాయి. దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడే సామర్థ్యం మన సైన్యానికి ఉంది'' అని అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనను ముగియగానే ప్రతిపక్ష నేతలు వాకౌట్ చేశారు.
రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే తవాంగ్‌లో భారత్-చైనా ముఖాముఖి సమస్యను లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోయిందని విమర్శించారు. ''ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిగా ఉన్నందున మన జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత దెబ్బతింటున్నాయి'' అని ఖర్గే అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు బిజినెస్‌ను సస్పెండ్ చేయాలని కోరారు. అందుకు డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిరాకరించారు. సభా నాయకుడు పియూశ్ గోయల్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఈ అంశంపై రక్షణ మంత్రి ప్రకటన చేస్తారని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తూ నినాదాలు ఇస్తున్న ప్రతిపక్షాలను సముదాయించేం దుకు ప్రతిపక్షాల స్థానాల వద్దకు పియూశ్ గోయల్ వెళ్లి ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. రక్షణ మంత్రి ప్రకటన తరువాత చర్చ పెడతారా? లేదా? అని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, కాంగ్రెస్ ఎంపీ పి చిదంబరం ప్రశ్నించారు. ఎలాంటి హామీ రాకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు నినా దాలు చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలతో హౌరెత్తించారు. దీంతో డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ సభను 35 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారం భమైన సభలో కూడా ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో ఆందోళన కొనసాగించారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. అంతకు ముందు పార్లమెంట్ ఆవరణలో 2001 పార్లమెంటు దాడిలో అమరవీరులకు ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్తో పాటు ఇతర పార్టీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభల్లో లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో డిప్యూటీ చైర్మెన్ హరి వంశ్నారాయణ్ సింగ్‌లు మాట్లాడుతూ. ''డిసెంబర్ 13న మన పార్లమెంటు పై జరిగిన పిరికిపంద చర్యగా గుర్తుంచుకుంటాం. ప్రజాస్వామ్య చిహ్నంపై దాడిని భగం చేసిన అప్రమత్తమైన భద్రతా సిబ్బంది త్యాగాన్ని కూడా మేం గుర్తుంచు కుంటాం'' అని అన్నారు. అనంతరం నాటి దుర్ఘటన, మరణించిన వారిన ఆత్మకు శాంతి చేకూరాలని ఉభయ సభల్లో అన్ని పార్టీల సభ్యులు మౌనం పాటించారు.