Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మైనారిటీ విద్యార్థులకు మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (ఎంఏఎన్ఎఫ్) నిలిపివేయడంపై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (జేఎన్యూటీఏ) అసంతప్తి వ్యక్తం చేసింది. ఇది సమైక్యత, ప్రజాస్వామ్య విలువలపై దాడిగా పేర్కొంది. ఈ (ఎంఏఎన్ఎఫ్) నగదు సహాయాన్ని నిలిపివేస్తున్నట్టు ఇటీవల మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, సిక్కులకు పీహెచ్డీ చదివేందుకు ఈ ఫెలోషిప్ ద్వారా కేంద్రం అందించే ఆర్థిక సహాయాన్ని రద్దు చేస్తున్నట్టు ఈ నెల 10న మైనారిటీ వ్యవహారాల మంత్రి ప్రకటించినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై అసంతప్తి వ్యక్తం చేస్తున్నట్టు జేఎన్యూటీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. 'మైనారిటీ వ్యతిరేక విధానం''గా స్పష్టంగా కనిపిస్తున్న ఈ ప్రకటనను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. విద్యా సంబంధిత నైపుణ్యం స్వేచ్ఛాపూరిత, భయం లేని వాతావరణంతోనే కాదు.. సామాజిక ప్రతికూలతలు తొలగిపోతేనే మరింతగా వద్ధి చెందుతుందని పేర్కొంది. 'భారత ప్రభుత్వం ఉన్నత విద్యావ్యవస్థలో వివిధ మంత్రుల, విభాగాల ద్వారా ఎంఏఎన్ఎఫ్తో పాటు పలు ఫెలోషిప్లను అందిస్తోంది. ఎంఏఎన్ఎఫ్ మినహా మిగిలిన అన్ని పథకాలు మైనారిటీలతో అన్ని వర్గాలకు చెందిన అభ్యర్థులకు అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఎంఏఎన్ఎఫ్ పథకం కింద కేవలం మైనారిటీ అభ్యర్థులు మాత్రమే లబ్థి పొందుతున్నారు. ఉన్నత విద్యావ్యవస్థలో అన్ని పథకాలు మైనారిటీ విద్యార్థులు సహా అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నప్పుడు.. ప్రత్యేకంగా ఎంఏఎన్ఎఫ్ పథకం అవసరంలేదు. దీంతో వచ్చే ఏడాది 2022-23 నుండి ప్రభుత్వం ఎంఏఎన్ఎఫ్ పథకాన్ని నిలిపివేస్తుంది' అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. అలాగే 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు కేంంద అందించే ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కూడా ఇకపై వర్తించదని పేర్కొన్నారు.