Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కర్నాటకలో మంగళవారం జికా వైరస్ కేసు వెలుగుచూసింది. దీంతో కర్నాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర కర్నాటకలోని రారుచూర్లో జిల్లాకు చెందిన ఐదేండ్ల బాలిక జికా వైరస్ బారిన పడినట్టు నిర్థారణ అయింది. మాండోస్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని ఆరోగ్య నిపుణులు అంచనా. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆరోగ్య మంత్రిత్వశాఖను ఆదేశించింది. ఇప్పటికే బాలిక ప్రయాణ సమాచారాన్ని అధికారులు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే చిన్నారి నివాసిత ప్రాంతంలో జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల బ్లడ్, యూరిన్ నమూనాలను సేకరించారు. ఇప్పటివరకు వారిలో ఐదుగ్గురికి నెగటివ్ వచ్చింది.కాగా, జికావైరస్పై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి సుధాకర్ స్పందించారు. రాష్ట్రంలో జికా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టనున్నట్టు.. ఈ పరిస్థితిని ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోనున్నట్లు తెలిపారు. పూణెకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షల్లో ఈ వ్యాధి నిర్థారణ అయిందని ఆయన వెల్లడించారు. నవంబర్ 13న బాలికకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు సింధనూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చిన్నారికి డెంగ్యూజ్వరం సోకినట్లు పరీక్షల్లో నిర్థారణ అయింది. దీంతో బాలికను విజయనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్కు తరలించి నవంబర్ 15 నుంచి 18 వరకు చికిత్సనందించారు. వైద్యులు చిన్నారి యూరిన్, బ్లడ్ నమూనాలు సేకరించి పూనె లేబొరేటరీకి పంపారు.