Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ డా|| పిడమర్తి రవి
న్యూఢిల్లీ : టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారడం సంతోషకరమైన విషయమనీ, అతితక్కువ కాలంలోనే, బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించి, కేసీఆర్ విజన్‌ను తెలుసుకునే సమయం వచ్చిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డా|| పిడమర్తి రవి అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ఉమ్మడి రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన విభజించే అధికారం రాష్ట్రాలకు కల్పిస్తూ చట్టం తేవాలని డిమాండ్‌చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు 20శాతం రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం చారిత్రక అవసరమనీ, కేసీఆర్ చాలా విజన్ ఉన్ననాయకుడని తెలిపారు. కేసీఆర్ ప్రధాని అయ్యి దేశంలో సమూల మార్పులకు నాంది పలుకుతారని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో దళితసంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు బూదాల బాబూరావు, మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్, మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డా||బొల్లికొండ వీరేందర్, తదితరులు పాల్గొన్నారు.