Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎంపీ హుకుం
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ ఎంపీఎల్ఏడీ (పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం) ఫండ్‌ను 'భజనలు- కీర్తనలు' కోసం ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 11వ తేదీ ఆదివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేవాలయంలో సంగీత వాయిదాల్యను ఏర్పాటు చేయడంలో సమస్య ఉంటే.. ఎంపీఎల్ఏడీ నిధిని ఉపయోగించవచ్చని బల్లియా జిల్లా అధికారులకు ఆదేశించారు. ఈ ఎంపీఎల్ఏడీ స్కీమ్ కింద ఎంపీలకు ప్రతి ఏటా రూ.5 కోట్లు అందుతాయి. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ నిధిని ఎంపీలు ఆ రాష్ట్రంలో రోడ్లు, పాఠశాలలు, హెల్త్ క్లీనిక్‌లు వంటి పనుల కోసం ఉపయోగించాలి. అయితే ఈ నిధులను బీజేపీ ఎంపీ వీరేంద్రసింగ్ దేవాలయాల్లో భజనలు, కీర్తనల కోసం, సంగీత వాయిద్యాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించడం గమనార్హం. కాగా, ''ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ విలువలు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయాల్లో భజనలు కీర్తనల్ని ప్రోత్సహించడం ఎంతో అవసరం. అందుకే ఈ కీర్తనలకు సంగీత వాయిద్యాలను ఉపయోగించడం వల్ల సాంస్కృతిక మతపరమైన కార్యకలాపాలు పెరుగుతాయి. సమాజంలో ఆధ్యాత్మిక మేలుకొలుపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా''నని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బల్లియా జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ప్రాంతంలో ఉన్న చిన్న, పెద్ద దేవాలయాలను సర్వే చేయాలని, ఆ దేవాలయాల్లో సంగీత వాయిదాల్యను కొనుగోలు చేయడానికి ఏర్పాటుచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎంపీ ఆదేశానుసారం మున్సిపల్ కార్మికుల బందంతో ఆలయాల సర్వేను త్వరలో ప్రారంభిస్తున్నట్టు మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యప్రకాశ్ మీడియాకు తెలిపారు.