Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్లును ఆమోదించిన కేరళ అసెంబ్లీ
తిరువనంతపురం : విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లును కేరళ అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. కేరళలోని 8 విశ్వవిద్యాలయాలకు ఎక్స్ అఫీషియో ఛాన్సలర్‌గా గవర్నర్ ఉన్నారు. ఆయనను ఆ పదవి నుంచి తొలగించేందుకు, ఛాన్సలర్‌ను నియమించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 8 చట్టాలను సవరించాలని యూనివర్శిటీ లాస్ (సవరణ) (నెం.2) బిల్లు, 2022ను సభ ఆమోదించింది. వ్యవసాయం, వెటర్నరీ సైన్స్, టెక్నాలజీ, వైద్య, సామాజిక శాస్త్ర, సాహిత్య, కళ, సంస్కృతీ, న్యాయ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో నిపుణులైన లేదా ప్రఖ్యాత విద్యావేత్తలను ప్రభుత్వం ఛాన్సలర్‌గా నియమించవచ్చునని బిల్లులో పేర్కొన్నారు. అలా నియమించిన ఛాన్సలర్‌కి ఐదేళ్ళు కాలపరిమితి వుంటుంది. తిరిగి నియమించడానికి అర్హుడు కూడా. ప్రవర్తన సరిగా లేదనే ఆరోపణలపై లేదా మరే ఇతర, తగిన కారణాలతోనైనా ఛాన్సలర్‌ను తొలగించేందుకు ప్రభుత్వానికి అధికారాలు కూడా వుంటాయి. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపికతో సహా వివిధ అంశాలపై గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదించబడడం గమనార్హం. అయితే ఈ బిల్లు అమల్లోకి రావాలంటే గవర్నర్ ఆమోద ముద్ర వుండాల్సిందే. కేరళ న్యాయ శాఖ మంత్రి పి రాజీవ్ ఈ బిల్లును సభలో ప్రవేపెట్టారు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం, 1971, కేరళ వర్శిటీ చట్టం, 1974, కాలికట్ వర్శిటీ చట్టం, 1975లతో సహా పలు చట్టాలను సవరించారు. ఛాన్సలర్‌గా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.