Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బిజెపి ఈశాన్య భారతంలో తన ఏలాగైనా ప్రాభల్యం ప్రదర్శించడానికి అడ్డదారులకు పాల్పడుతుంది. తాజాగా మేఘాలయాలో ఆపరేషన్ కమల్ నిర్వహించి నలుగురు ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకుంది. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో అధికార పార్టీ, బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి చెందిన వారు కావడం విశేషం. మేఘాలయాలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బిజెపి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది. 2018 ఎన్నికల్లో బిజెపి రెండు అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఎన్‌పిపికి చెందిన ఎమ్మెల్యేలు బెనెడిక్ మారక్, ఫెర్లిన్ సంగ్మాతో పాటు టిఎంసి ఎమ్మెల్యే హిమాలయ ముక్తన్ షంగ్పిలాంగ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సామ్యూల్ ఎం సంగ్మా తాజాగా బిజెపిలో చేరారు.