Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో పోస్టు ఆఫీసుల్లో 75,384 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్ చౌహాన్ తెలిపారు. లోక్‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గ్రూప్ ఎలో 236, గ్రూప్ బిలో 7,743, గ్రూప్ సిలో 67,405 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
భూమి ఇచ్చిన వారికి ఉద్యోగం విధానం రద్దు
రైల్వే ప్రాజెక్టుల్లో భూమి కోల్పోయిన వారికి ఉద్యోగులు కల్పించే విధానాన్ని ఉపసంహరించు కున్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్ తెలిపారు. ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019 నవంబర్ 11న రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నియామకాల కోసం భూమి కోల్పోయిన వారి డిమాండ్లను ఎప్పటికప్పుడు అందించిన సూచనల మేరకు పరిష్కరిస్తామని అన్నారు.
తెలంగాణలో 18,588
ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజ్యసభలో ఆప్ ఎంపి సంజరు సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021-22లో తెలంగాణలో 18,588, ఏపిలో 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించలేం
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
విద్యా, ఉపాధి రంగాలలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భౌమక్ బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికపై విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని సుదీర్ఘ కాలంగా వస్తున్న న్యాయమైన డిమాండ్‌ను ప్రభు త్వం పరిగణనలోకి తీసుకుందా? పరిగణలోకి తీసు కున్న పక్షంలో ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పిం చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటీ? అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నల కు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అక్రమ మైనింగ్ కేసుల్లో మూడో స్థానంలో ఏపీ
అక్రమ మైనింగ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. లోక్‌సభలో ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు కేంద్ర గనుల మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. 2021-22లో ఏపిలో అక్రమ మైనింగ్‌కు సంబంధించి 9,351 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అక్రమ మైనింగ్‌లో ఉత్తరప్రదేశ్ (23,787), మధ్యప్రదేశ్ (9,361) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఎస్టీల్లో గోండులు... బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో (చందౌలి, ఖుషినగర్, సంత్ కబీర్ నగర్, సంత్ రవిదాస్) గోండు సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే రాజ్యాంగం (ఎసిసిలు, ఎస్టిలు) ఉత్తర్వు (రెండో సవరణ) బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపిం ది. ఈ బిల్లుపై గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా తన ముగింపు వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే బిల్లు ఆమోదం పొందింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో ఈ బిల్లుపై మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగింది. 26 మంది ఎంపిలు ప్రసంగించారు. పార్టీలకు అతీతంగా సభ్యులు ఈ బిల్లుకు మద్దతు పలి కారు. అయితే ప్రతిపక్ష ఎంపిలు మాత్రం ఇతర కులాలను చేర్చడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, కుల ఆధారిత జనాభా గణనను చేయాలనీ, దీని ద్వారా ఖచ్చితమైన సమాచారం ఆధా రంగా ఈ చేర్పులు చేయవచ్చని విజ్ఞప్తి చేశారు.