Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిస్థితి విషమం
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో 17 ఏండ్ల విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన బాలిక సఫ్దర్గంజ్ ఆసుత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు బాలిక తండ్రి తెలిపారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ దాడి జరిగింది. 17 ఏండ్లు, 13 ఏండ్ల వయస్సు కలిగిన తన ఇద్దరు కుమార్తెలు ఉదయం బయటికి వెళుతుండగా బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు యాసిడ్తో దాడి చేసినట్టు బాలిక తండ్రి తెలిపారు. వారు ముఖం కనిపించకుండా మాస్కులు ధరించారని బాలిక తండ్రి మీడియాకు వివరించారు. ఈ దాడిలో బాలిక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయనీ, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరు అనుమానితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎం. హర్షవర్ధన్ పేర్కొన్నారు.
జాతీయ మహిళా కమిషన్ విచారణ
ఈ యాసిడ్ దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (నేషనల్ కమిషన్ ఫర్ విమెన్) విచారణ చేపట్టింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ బృందం ఆస్పత్రికి వెళ్లి, బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ కేసులో విచారణ జరిపి బాధితురాలికి అవసరమైన సాయం అందజేస్తామని తెలిపింది. ఈ దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.