Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి మధ్య ఆస్తులు, అప్పులను విభజించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తులు, అప్పుల నిష్పాక్షిక, సమాన, సత్వర విభజన కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లోని హక్కులతో సహా తన ప్రజల ప్రయోజనాల కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయించామని పేర్కొంది. 2014 జూన్లో రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ చట్టం -2014 ప్రకారం ఆస్తులు, అప్పుల విభజన జరిగినప్ప టికీ, సత్వర పరిష్కారం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పదేపదే ప్రయత్ని ంచినప్పటికీ అసలు ఆస్తుల విభజన ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని న్యాయవాది మహ ఫూజ్ ఎ నజ్కి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొ న్నారు. చట్టంలోని షెడ్యూల్ -9 (91 సంస్థలు), షెడ్యూల్ -10 (142 సంస్థలు), మరో 12 సంస్థల ఆస్తులు, బాధ్యతలను రాష్ట్రాల మధ్య విభజించలేదని పేర్కొన్నారు. రూ. 1,42,601 కోట్ల విలువైన ఆస్తులను విభజన చేయకపోవ డంతో తెలంగాణకు ప్రయోజనం చేకూరు స్తుందని, వీటిలో 91 శాతం ఆస్తులు ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉన్నాయని, హైదరాబాద్ ప్రస్తు తం తెలంగాణలో ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. రాజధాని కేంద్రిత అభివృద్ధి నమూనా కారణంగా హైద రాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖర్చు చేసిం దని తెలిపారు. షెడ్యూల్ - 9 సంస్థ ల ప్రధాన కార్యాలయాల ఆస్తుల విలువ సుమారు రూ. 24,018.53 కోట్లుగా అంచనా అని, వీటిలో రూ. 22,556.45 కోట్ల విలువైన ఆస్తులు (93.9 శాతం) తెలంగాణ రాష్ట్రం లోనే ఉన్నాయని పేర్కొన్నారు. షె డ్యూల్-10 సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సి న స్థిర ఆస్తుల మొత్తం విలువ రూ. 34, 642.77 కోట్లని, వీటిలో రూ. 30,530.86 కోట్ల విలువైన ఆస్తులు (88 శాతం) తెలంగాణ రాష్ట్రం లోనే ఉన్నాయని పేర్కొన్నారు. చట్టంలోని షెడ్యూల్ -9, షెడ్యూల్ -10 లో పేర్కొనని 12 సంస్థలకు సంబంధిం చిన రూ. 1,759 కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా తెలంగాణాలోనే ఉన్నాయని తెలిపారు.
దిక్కుతోచన స్థితిలో ఉద్యోగులు
ఆస్తుల విభజన జరగకపో వడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ప్రాథమిక, ఇతర రాజ్యాంగ హక్కు లను తీవ్రంగా ప్రభావితం చేయ డం, ఉల్లంఘించడం వంటి అనేక సమస్యలకు దారితీసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ''ఈ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు (సుమారు 1,59, 096) సరైన విభజన లేకపోవడం వల్ల 2014 నుండి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విభజన తరువాత పదవీ విరమణ చేసిన పింఛనుదారుల పరిస్థితి దయనీయంగా ఉంది.
వారిలో చాలా మందికి పదవీ విరమణ ప్రయోజనాలు (టెర్మినల్ బెనిఫిట్లు) అందలేదు. అందువల్ల ఈ ఆస్తుల న్నింటినీ వీలైనంత త్వరగా విభజి ంచి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది'' అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సంస్థలన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పాలన అవసరాలతో ముడిపడి ఉన్నాయని, ప్రాథ మిక, ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తున్నా యని నొక్కి చెప్పారు. ఆస్తుల విభజన జరగక పోవడం వాటి పని తీరును తీవ్రంగా బలహీన పరిచిం దని, ఇది రాష్ట్ర ప్రజల పై ప్రత్యక్ష, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుం దని విజ్ఞప్తి చేశారు.అందువల్ల, తెలంగాణ చర్య ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, రాష్ట్రాల మధ్య ఆస్తులను వేగంగా విభజించ డానికి అవసరమైన అన్ని ఆదేశాలను ఇవ్వాలని సుప్రీం కోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది.