Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఎన్నికల సంఘానికి
సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : ఆధార్ అసుసంధానంలో ఓటరు ప్రొఫైలింగ్‌కు పాల్పడటం ముఖ్యమైన సమస్య అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటరు రికార్డులను ఆధార్‌కు అనుసంధానించడంలో భాగంగా గుర్తు తెలియని సాఫ్ట్వేర్ ఉపయోగించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు ప్రొఫైలింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరు కొడాలి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహంలతో కూడి న ధర్మాసనం విచారించింది. విచారణ సంద ర్భంగా ఈ అంశం ప్రాధాన్యమైందని ధర్మాసనం వ్యాఖ్యానిం చింది. ''ఓటరు రికార్డులను కాపీ చేసుకొనేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈసీఐ యాక్సెస్ ఇచ్చింది. ఈసీఐ చాలా సమర్థంగా ఒక సర్వైలెన్స్ ఉపయోగించి చాలా సున్నితమైన అంశాలైన కుల, మత, వర్గ, భాష, ఆదాయం, వైద్య తదితర వివరాలన్నింటినీ ఓటరు సమాచారంతో అనుసంధానిస్తోంది. దీన్ని రాజకీయ పార్టీలకు అనమతిస్తే వారు ప్రజల్ని గ్రూపులుగా విభజించే అవకాశం ఉంది. కొందరిని లక్ష్యం చేసుకోవడం కొందరిని ఓటరు జాబితా నుంచి తొలగించడం వంటివి చేసే అవకాశం ఉంది. స్వేచ్ఛాయుత ఎన్నికలకు ఆటంకం కలగొచ్చు'' అని శ్రీనివాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఓటరు జాబితాను సిద్ధం చేయడానికి ఈసిఐ చట్టబద్ధమైన బాధ్యతను విస్మరించిందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గౌతం భాటియా కోర్టుకు వివరించారు. ఈసిఐ చేపట్టిన ఈ చర్యల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని పేర్కొన్నారు. ఎలాంటి వివరణ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ''ఓటు హక్కు అనేది ఓటు హక్కుకు ఆటంకం కలగని లేదా ఓటు కోల్పోకుండా ఉండేలా హక్కును కలిగి ఉంటుంది. వారెవరూ డూప్లికేట్, మరో ప్రాంతానికి బదిలీ అయినవారు, చనిపోయిన వారు అనే కారణాలు చూపకుండా తొలగించడంతో భారీ సంఖ్యలో ఓటర్లపై ప్రభావం పడింది'' అని న్యాయవాదులు తెలిపారు. ఆరోపిత సాఫ్ట్వేర్ ఓటరు జాబితా ప్యూరిఫికేషన్ కోసం డేటాబేస్ మెయింటైన్డ్ సిస్టమ్ అని హైకోర్టు ముందు ఈసీఐ చెప్పిందని, అయితే స్వయంగా నిర్ణయం తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌లో అల్గారిధమ్ లేదని న్యాయవాదులు పేర్కొన్నారు. ఓటరు జాబితా నుంచి ఎవరిదైనా పేరు తొలగించడం వల్ల ఎవరైనా బాధపడితే జాబితాలో పేరు చేర్చాలని వారు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందని హైకోర్టు చెబుతూ పిటిషన్ కొట్టివేసిందని న్యాయవాదులు తెలిపారు. అనంతరం పిటిషనర్ ఆరోపణలపై కౌంటరు దాఖలు చేయాలని ఈసీఐను ధర్మాసనం ఆదేశించింది.