Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : శ్రద్ధా వాకర్ హత్య కేసులో గురువారం పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఢిల్లీలోని మోహ్రౌలి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు దొరికిన ఎముకలు శ్రద్ధా వాకర్‌వేనని డీఎన్ఏ పరీక్షలో నిర్థారణైంది. వారి ఫ్లాట్‌లో లభించిన రక్తపు మరకలు కూడా ఆమెవేనని తేలింది.
పలు ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీకి విశ్లేషణకు పంపారు. శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ డిఎన్ఎతో ఎముకల డీఎన్ఏ మ్యాచ్ అయిందనీ, దీంతో ఆ ఎముకలు శ్రద్ధావే అని తేలిందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే పాలిగ్రాఫ్, నార్కో పరీక్షల్లో శ్రద్ధాను తానే హత్య చేసినట్టు అఫ్తాబ్ పూనావాలా వెల్లడించాడు. ఆఫ్తాబ్ అరెస్టయిన నెలరోజుల అనంతరం కీలక ఆధారాలు వెలుగు చూశాయని పోలీసులు తెలిపారు. శ్రద్ధా వాకర్‌ను అఫ్తాబ్ పూనావాల మే 18న అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి మోహ్రౌలి సమీపంలోని అడవుల్లో పారేసిన సంగతి తెలిసిందే.