Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఈపీతో గందరగోళం సృష్టిస్తున్న యూజీసీ
- కొత్త ఫ్రేమ్‌వర్క్‌పై ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల ఆగ్రహం
న్యూఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల విడుదల చేసిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం పాఠ్యాంశాలు, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ అసమానతలతో నిండి ఉన్నదని ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆరో పించారు. ఇది ఉన్నత విద్య నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మల్టీ డిసిప్లినరీ కోర్సులపై యూజీసీ ఫ్రేమ్‌వర్క్ అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ఈ వ్యతిరేకత వచ్చింది. ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. విద్యార్థులు వరుసగా రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్లు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్లు, డిప్లోమాలు, డిగ్రీలను సంపాదిస్తారు. ఒక విద్యార్థి పరిశోధనకు అంకితమైన నాలుగో సంవత్సరం పూర్తి చేసిన తర్వాత గౌరవ కార్యక్రమంతో డిగ్రీని పొందుతాడు. కొత్త ఫ్రేమ్ వర్క్‌పై ఢిల్లీ యూనివర్సిటీ మాజీ అకడమిక్ కౌన్సిల్ సభ్యుడు రుద్రశిష్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఎన్ఈపీ కింద నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ యొక్క సవరించిన నిర్మాణం, తదనుగుణంగా చర్యలు తీసుకో వాలని విశ్వవిద్యాలయాలకు సూచన అనేది ఒక అపరిమితమైన విపత్తు అన్నారు. ఇది భారత్‌లోని మొత్తం ఉన్నత విద్యారంగాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తుందని ఆయన అన్నారు. నాణ్యమైన, ప్రభుత్వ నిధులతో కూడిన ఉన్నత విద్యను విద్యార్థులు పొందటానికి ఇది నిరాకరిస్తుందని డెమోక్రాటిక్ టీచర్స్ ఫ్రంట్ సభ్యుడు కూడా అయిన చక్రవర్తి అన్నారు. నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) పేరుతో యూజీసీ యూనివర్సిటీల్లో గందరగోళం సృష్టిస్తున్నదని అకడమిక్స్ ఫర్ యాక్షన్ అండ్ డెవలప్మెంట్ టీచర్స్ అసోసియేషన్ జాతీయ అధికార ప్రతినిధి రాజేశ్ ఝా తెలిపారు. నాలుగేండ్ల అండర్ గ్రాడ్యు యేట్ కోర్సుల విషయానికొస్తే, కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం డిగ్రీతో విద్యార్థికి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.